పూర్వ విద్యార్థులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో 2022 -2025 వా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు అపూర్వ విద్యార్థుల కలయిక సమ్మేళనా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల నిర్వాహకులు శివప్రసాద్, దాము, నరసింహులు, రమేష్, భాగ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రితం పట్టణ నడి బొడ్డున గల కళాశాలలో తాము చదువుకోవడం జరిగిందని, నిష్ణాతులైన అధ్యాపకులచే మంచి బోధన రావడం వలన మేము ఎంతో ఉన్నత స్థాయికి, మంచి మార్గదర్శకులుగా ఉండడం జరిగిందన్నారు. ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, అప్పటి అధ్యాపకులతో ఒకే వేదిక మీద తాము కలవడం పూర్వజన్మ సుకృతం అని వారు తెలిపారు. ఇటువంటి అపూర్వ విద్యార్థుల కలయిక విజయవంతం చేసిన ప్రతి పూర్వ విద్యార్థికి తాము పేరుపేరునా కృతజ్ఞతలను తెలియజేశామని తెలిపారు. అంతేకాకుండా ఆనాటి అధ్యాపకులు అయిన రాజన్న, ఓబయ్య, శశాంక్ ,ప్రశాంతి మాట్లాడుతూ మా పూర్వ విద్యార్థులను ఒకే వేదిక మీద మాతో పాటు ఇలా కలుసుకోవడం ఆనందింపదగ్గ విషయమని, మా జీవితంలో ఇది మరుపురాని మంచి ఘటన అని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అధ్యాపకులుగా మేము కూడా నిరంతర విద్యార్థుల మేనని, విద్యార్థులు కూడా నిరంతర విద్యార్థిగా ఉంటూ, మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతూ, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పుడే కళాశాలకు, అధ్యాపకులకు ,తల్లిదండ్రులకు ధర్మవరమునకు మంచి పేరు వస్తుందని తెలిపారు. ఆనాడు నడిబొడ్డున గల ఈ కళాశాలలో హైస్కూలు, ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాల ఉండేదని తెలిపారు. తదుపరి కాలక్రమమైన డిగ్రీ కళాశాల గుట్ట కింద పల్లి లో కె హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలుగా ఉండడం, ఇప్పటికీ ఆ కళాశాల ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిందని తెలిపారు. కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న అధ్యాపకులు, ప్రిన్సిపాల్ లు విద్యార్థుల అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం పూర్వ విద్యార్థులు అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. అధ్యాపకులు ప్రసంగించిన వైనం పూర్వ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతమున్న కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థులుగా తాము కొన్ని తరగతులకు పెయింటింగ్ వేయించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను మా కళాశాలకు అందజేస్తామని తెలిపారు.ఈ పూర్వ విద్యార్థుల కలయిక సమ్మేళనా కార్యక్రమంలో 70 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
అపూర్వ విద్యార్థుల కలయిక సమ్మేళనం విజయవంతం..
- Advertisement -
RELATED ARTICLES


