Sunday, December 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం ఆర్టీసీ ఎన్ఎంయుఏ నూతన కమిటీ ఏర్పాటు

ధర్మవరం ఆర్టీసీ ఎన్ఎంయుఏ నూతన కమిటీ ఏర్పాటు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ఎన్జీవో హోం లో ధర్మవరం ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకుగాను ఉద్యోగులు సర్వసభ్య సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ సమావేశానికి రీజినల్ కార్యదర్శి షబ్బీర్, ధర్మవరం డిపో గౌరవ అధ్యక్షులు డోలా రాజారెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రయాణికులకు, ఉద్యోగుల సమస్యలకు యూనియన్ కట్టుబడి ఉందని, సమస్యల పరిష్కార దిశగా ఆర్టీసీ ఉద్యోగులు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అంతేకాకుండా నూతన కమిటీ ద్వారా ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం, ప్రభుత్వ దిష్టికి తీసుకొని వెళ్లి పరిష్కార దిశగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తదుపరి నూతన కమిటీకి వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఎన్ఎంయుఏ డిపో చైర్మన్ గా హనుమాన్, డిపో అధ్యక్షులుగా గోపాల్, డిపో కార్యదర్శిగా మధుసూదన్, డిపో కోశాధికారిగా వైవిఎన్ రెడ్డి, గ్యారేజ్ అధ్యక్షులుగా డిఆర్ కుమార్, గ్యారేజ్ కార్యదర్శిగా హరికృష్ణ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ వారు మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి, ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు చేయుటకు, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు తాము నిరంతరం అండదండలుగా ఉంటూ పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ ముత్యాలప్ప, రీజినల్ నాయకులు నాగప్ప, దుర్గాప్రసాద్, డిపో నాయకులు అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు