శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; మానవులకు సేవ చేయుట దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 350 మందికి రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు స్వీట్లును ఆసుపత్రి వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నామా ప్రసాద్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దాతల సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మాకు ఎంతో సంతోషాన్ని, తృప్తిని ఇస్తోందని తెలిపారు. దాతల సహకారంతో ఆకలిగున్నవారికి, వైద్యం పొందుతున్న వారికి ఈ రూపేనా పుట్టపర్తి బాబా ఆశీస్సులతో అందించడం జరుగుతోందని తెలిపారు. నేటి ఈ సేవ దాతగా కీర్తిశేషులు దాసరి తులసమ్మ భర్త వెంకటస్వామి వారి దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం దాతకు వారు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సమితి వారు చేస్తున్న సేవలు మరుపు రానివని, రోగులకు వరంగా మారాయని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు దాతలు కూడా ముందుకు వచ్చి మానవతా విలువలను పెంపదింప చేయాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి తరుపున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
మానవులకు సేవ చేయుట దైవ సేవతో సమానం..
- Advertisement -
RELATED ARTICLES


