Sunday, December 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎస్కేయూ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలకు ఎంపిక ..

ఎస్కేయూ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలకు ఎంపిక ..

- Advertisement -

ప్రిన్సిపాల్ హర్షవర్ధన్
విశాలాంధ్ర ధర్మవరం; నవంబర్ 6 , 7వ తేదీలను గుంతకల్లులో జరిగిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గ్రూప్ సి. అంతర కళాశాలల ఫుట్బాల్ ప్రాబబుల్స్ నందు పాల్గొన్న భరత్ కుమార్ రెడ్డి గ్రూప్ ఏ పోటీల నందు బాల్ బాడ్మింటన్ లో రన్నర్స్ గా నిలిచిన తమ కళాశాల జట్టు కెప్టెన్ సాయికుమార్, యూనివర్సిటీ టీంకు ఎంపికయ్యారని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ హర్షవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎంపికైన విద్యార్థులను సోమవారం కళాశాల నందు అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కరణం హర్షవర్ధన్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా క్రీడా పోటీలు నందు కూడా మంచి స్థానాలలో ఉండటం తమకు గర్వకారణమని, వారిని తాము ఎల్లప్పుడూ తగువిధంగా ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జ్ రమేష్, ఎన్ఎస్ఎస్ పిఓ శ్రీనివాసులు, అకాడమిక్ ఇంచార్జ్ కృష్ణయ్య, అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు