Sunday, December 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం పట్టణ పరిశుభ్రత, నీటి సరఫరాపై ఎన్డీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం

ధర్మవరం పట్టణ పరిశుభ్రత, నీటి సరఫరాపై ఎన్డీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం

- Advertisement -

మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు, ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు రెండు ముఖ్యమైన సమీక్షా సమావేశాలను నిర్వహించారు.మొదటగా ధర్మవరం మున్సిపాలిటీ శానిటరీ అధికారులతో జరిగిన సమావేశంలో పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వీధి, ప్రతి వార్డు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఆటంకం లేకుండా చెత్తాచెదారం, డ్రైనేజీ వ్యవస్థలను పూర్తిగా శుభ్రపరచాలని ఆదేశించారు. ధర్మవరం పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా నిలబెట్టడం మనందరి బాధ్యత అని తెలిపారు. ప్రతి ప్రాంతాన్ని శుభ్రంగా, పచ్చదనంతో నింపేలా అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వారు స్పష్టం చేశారు. తదుపరి సమావేశంలో మున్సిపాలిటీ వాటర్‌లైన్ మెన్స్‌తో హరీష్ బాబు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు నీటి సరఫరా నిరాటంకంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించడం జరిగింది. ఎక్కడా నీటి కొరత రాకూడదు అని, నీరు వృధాగా పోకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలి అని తెలిపారు. ప్రతి ఇంటికి సమయానికి నీరు అందేలా చూడాలి అని ఆయన సూచించారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సదుపాయాల మెరుగుదలలో మంత్రి మార్గదర్శకత్వంలో బీజేపీ శ్రద్ధతో ముందుకు సాగుతుందని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు