Homeజిల్లాలుఅనంతపురంకరాటే విద్య ప్రదర్శన

కరాటే విద్య ప్రదర్శన

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;మల్టీ స్టార్ ఆల్ ఇండియా బుడోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ధర్మవరం కళాజ్యోతి జడ్పీ గర్ల్స్ హై స్కూల్ లో నిర్వహించినటువంటి బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ దాదాపు 80 మంది విద్యార్థులు కరాటే విద్యను ప్రదర్శించారు.నేర్చుకున్నటువంటి విద్యను ప్రదర్శించి వారిలో ఉన్నటువంటి,నైపుణ్యం గల 65 మంది విద్యార్థులకు బెల్ట్లు,ప్రశాంశ పత్రాలు ఎల్లో,ఆరెంజ్,గ్రీన్, బ్లూ , పర్పల్, బ్రౌన్ ,బెల్స్ అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి టిడిపి నాయకులు సంధ రాగవ, మాంగల్య సిల్క్స పురుషోత్తం ,కొత్తపేట ఆది,కదిరి సీనియర్ కరాటే మాస్టర్ షేక్షావలి వీరందరి చేతుల మీదుగా పిల్లలకు బెల్ట్లు ప్రశాంశ పత్రాలు అందజేయడం జరిగింది. ముఖ్యఅతిథులు మాట్లాడుతూ మాట్లాడుతూ పిల్లలకు చదువుతోపాటు కరాటే లాంటి యుద్ధ నేర్చుకోవడం వలన తమకు తాము రక్షించుకునే విధంగా ఎంతగానో గృహ పడుతుందని పిల్లలకు పిల్లల తల్లితండ్రులకు విన్నవించడం జరిగిందన్నారు. అలానే స్పోర్ట్స్ కోట కింద 3 శాతం రిజర్వేషన్ అలానే ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి అన్నారు. అని ప్రతి ఒక్కరూ కరాటే అండ్ జూడో లాంటి క్రీడా రంగాలలో ఉంటూ మీ ఉజ్జలమైన మీ బంగారు భవిష్యత్తును చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోకరాటే మాస్టర్లు ఇనాయత్ భాష,జి.నవ్య శ్రీ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశా రు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు