విశ్వదీప సేవా సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: నేత్రదానం సహకరించిన కుటుంబ సభ్యులకు వారి ఇంటికి వెళ్లి, విశ్వదీప సేవా సంఘం వారు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అనంతరం విశ్వదీప సేవా సంఘం వారు మాట్లాడుతూ నేత్రదానం పై అవగాహనలో భాగంగా నేత్రదానం చేయించుటలో సహకరించిన నేత్రదాతల కుటుంబ సభ్యులను సన్మానం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫ్టలమిక్ అధికారి ఉరుకుందప్ప, ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి ,సేవా సంఘం ఫౌండర్ కోళ్ళమొరం చంద్రశేఖర్ రెడ్డి , ఎం అధ్యక్షులు గాజుల సురేష్ కార్యదర్శి జుజార్ రఘు సభ్యులు ఖమ్మం మాధవ, నారాయణస్వామి, తిప్పయ్య కేశవరెడ్డి,వెంకటరాముడు సుబ్రహ్మణ్యం,వెంకటేష్, వెంకటనారాయణ,నేత్రదాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నేత్రదానంకు సహకరించిన వారికి సన్మానం..
- Advertisement -
RELATED ARTICLES


