Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం చైర్మన్ అభ్యర్థి ఖరారు.. కౌన్సిలర్ల వేటలో బహుజన సమాజ్ పార్టీ

ధర్మవరం చైర్మన్ అభ్యర్థి ఖరారు.. కౌన్సిలర్ల వేటలో బహుజన సమాజ్ పార్టీ

- Advertisement -

ధర్మవరం బీఎస్పీ ఇంచార్జ్ సాకే వినయ్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;!రాబోయే ధర్మవరం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ మరియు జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో కీలక విషయాలు వెల్లడించారు. స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో వివిధ వార్డుల నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేయడానికి ఆసక్తి గల అభ్యర్థులు ఆయా రిజర్వేషన్లకు అనుగుణంగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ధర్మవరంలో సామాజిక న్యాయం, మార్పును కోరుకునే నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకునేవారు ఈ నెల 16వ తేదీ లోపు తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సాకే వినయ్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే, ధర్మవరం మున్సిపాలిటీకి సంబంధించి బిఎస్పి తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని ఇప్పటికే అధికారికంగా ఖరారు చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.బీఎస్పీ గుర్తు , ఇండిపెండెంట్లకు అవకాశం అని తెలిపారు.పార్టీ అధికారిక ‘ఏనుగు’ గుర్తుపై కౌన్సిలర్‌గా పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అదేవిధంగా, బీఎస్పీ గుర్తు పైనే కాకుండా ఇండిపెండెంట్ (స్వతంత్ర) అభ్యర్థులుగా కౌన్సిలర్‌ బరిలో నిలవాలనుకునే అర్హులైన వారికి కూడా బహుజన సమాజ్ పార్టీ పూర్తి మద్దతు అందిస్తుందని, వారికి కూడా తగిన అవకాశం కల్పిస్తామని తెలిపారు. ధర్మవరం మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు, దరఖాస్తుల కొరకు లేదా ఇతర వివరాల కోసం 8639261441, 9885383330 ఫోన్ నెంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు