కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం పురపాలక సంఘం యందు మెప్పా మహిళా సంఘాలకు సంబంధించిన సాయి నగర్ కాలనీవాసులైన శారదాంబ మహిళా పొదుపు సంఘం సభ్యురాలు అయిన కే జ్యోతమ్మ తయారుచేసిన తోలుబొమ్మల తయారీ రంగంలోనూ, పారిశ్రామికవేత్తగాను మంచి ప్రతి ఘనపరిచినందుకు మిషన్ డైరెక్టర్ మెప్మా గుంటూరు వారు ప్రేరణ సఖికి ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమ ఎంపికలో ధర్మవరం పురపాలక స్థాయిలో ఎంపిక కావడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రమోద్ కుమార్ చేతుని మీదుగా డ్రెస్ కోడ్ను అందజేయడం జరిగింది. జ్యోతమ్మ శ్రీ సత్యసాయి జిల్లాస్థాయిలో పుట్టపర్తి నందు జరుగు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రేరణ సఖి ప్రశంసా పత్రమును అందుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ తోపాటు టిపిఆర్ఓ విజయభాస్కర్ రాయల్, సిబ్బంది అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
తోలుబొమ్మల తయారీ రంగంలో ధర్మవరం పురపాలక స్థాయిలో ఎంపిక
RELATED ARTICLES