Sunday, March 30, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపట్టణ పరిశుభ్రతలో మరో ముందడుగు వేసిన ధర్మవరం మున్సిపాలిటీ..

పట్టణ పరిశుభ్రతలో మరో ముందడుగు వేసిన ధర్మవరం మున్సిపాలిటీ..

మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణ పరిశుభ్రతలో ధర్మవరం మున్సిపాలిటీ మరో ముందడుగు వేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతకు చెత్త వేసుకునే బండ్లు ఎంతో ముఖ్యమని వారు తెలిపారు. ఇందులో భాగంగానే ఇటీవల 40 పుష్కార్డ్ బండ్లను తెప్పించడం జరిగిందని, వాటిని 40 వార్డులకు పంపించడం జరిగిందన్నారు. ఇంకనూ 60 పుష్కార్డ్ బండ్లు వస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా వీల్ బరస్ బండ్లు కూడా 100 వస్తున్నాయని తెలిపారు. దీని ద్వారా రోడ్డుపైన వేసిన చెత్త ఎప్పటికప్పుడు శుభ్రం చేసే అవకాశం వస్తుందని తెలిపారు. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఇటీవలే 47 మందికి పురుషులకు రెండు యూనిఫార్ములు మహిళలకు రెండు చీరలు తోపాటు సామాగ్రి పనిముట్లు కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం పట్టణ పరిశుభ్రతకు పనీముట్లు కొరత తీరిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పట్టణ పరిశుభ్రతకు మునుముందు కూడా మరింత కృషి చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు