విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని 26 వ వార్డు లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి పక్కన ఎర్రగుంట ప్రాంతం నందు మహమ్మద్ ఎగ్బల్ , దిల్షాద్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ నిరుపేదల కుటుంబాలకు 300 మందికి పైగా రంజాన్ నిత్యవసర సరుకులు మరియు స్త్రీ లకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి సాయంత్రం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ భోజన కార్యక్రమానికి 1000 మంది పైగా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగినది. ఈ సందర్భంగా యర్రగుంట షాక్షావలి మాట్లాడుతూ మహమ్మద్ ఎగ్బల్ , దిల్షాద్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రంజన్ తోఫా పంపిణీ కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజలకు సహాయ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి రంజాన్ మాసంలో పేద ప్రజలు ప్రతి ఒక్కరు సంతోషంగా పండగ జరుపుకోవాలని ఉద్దేశంతో సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 300 వందల మందికి పైగా పేద కుటుంబాలకు సరుకులు, స్త్రీలకు చీరలు అందజేశామని తెలిపారు. అంతేకాకుండా యర్రగుంట లోని ఉస్మానియా మసీదు నందు ప్రజలకు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున 1000 మందికి పైగా ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఎగ్బల్ , దిల్షాద్, కొడుకులు యరగుంట షేక్షావలి, షాషావలి, జిలాన్ భాష, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదల కుటుంబాలకు రంజాన్ నిత్యవసర సరుకులు, చీరలు పంపిణీ
RELATED ARTICLES