Monday, May 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయియుటిఎఫ్ వెల్ఫేర్ పాలసీ బాండ్లు పంపిణీ

యుటిఎఫ్ వెల్ఫేర్ పాలసీ బాండ్లు పంపిణీ

విశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వెల్ఫేర్ పాలసీ బాండ్లను ధర్మవరం పట్టణంలోని స్థానిక యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్ర రెడ్డి, యుటిఎఫ్ జిల్లా నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా శెట్టిపి జయచంద్రా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యుటిఎఫ్ నాయకుల సంక్షేమం, ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని యుటిఎఫ్ వెల్ఫేర్ పాలసీని రాష్ట్ర, జిల్లా నాయకులకు అందజేస్తున్నారు అని తెలిపారు. ఈ పాలసీలో భాగంగా యుటిఎఫ్ నాయకులు ఎవరైనా అనారోగ్య రీత్యా శస్త్ర చికిత్సలు అవసరం అయితే ఈ పాలసీ ద్వారా ఒక లక్ష నుండి రెండు లక్షల వరకు తక్షణ సహాయం ఉంటుందన్నారు. అలాగే ఒకవేళ మరణిస్తే రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు తక్షణ సహాయం అందజేయబడుతుందన్నారు. అందుకే ఈ పాలసీ అందరికీ ఉపయోగపడుతుందని తెలిపారూ. ప్రస్తుతం ఈ పాలసీ విధానం రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి అలాగే పూర్వపు రాష్ట్ర, జిల్లా నాయకులకు వర్తింపజేసి, వారికి బాండ్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో యుటిఎఫ్ వెల్ఫేర్ పాలసీని మండల, పట్టణ నాయకత్వానికి, కార్యకర్తలకు కూడా అమలుచేసే విధంగా తనవంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ మేరివర కుమారి, జిల్లా కార్యదర్శులు
లతాదేవి, రామకృష్ణ నాయక్, ధర్మవరం జోన్ నాయకులు ఆంజనేయులు, .లక్ష్మయ్య, సకల చంద్రశేఖర్, పెద్దకోట్ల సురేష్, రాంప్రసాద్,సాయి గణేష్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు