సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్
విశాలాంద్ర బ్యూరో శ్రీ సత్యసాయి – పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయంలో పటిష్టమైన భద్రతను కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం విమానాశ్రయంలో నిర్వహించిన ఎయిర్‌పోర్టు భద్రతా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.భద్రతా పరమైన సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వ అధికారులు, విమానాశ్రయ నిర్వాహకులు పరస్పర సహకారంతో సమాచారాన్ని పంచుకోవాలి.అత్యవసర సమయాల్లో ఏ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.విమానాశ్రయ భద్రతా ప్రమాణాలపై సిబ్బంది ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కలెక్టర్ వీక్షించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఆర్డీఓ సువర్ణ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.


