విశాలాంధ్ర – నెల్లిమర్ల : నెల్లిమర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా ఉపవిద్యాశాఖాధికారి కె. వి. రమణ గురువారం ఆకస్మికంగా సందర్శించారు . ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా స్థాయి తెలుసుకున్నారు. విద్యార్థుల మానసిక, శారీరిక అభివృద్ధికి తోడ్పడే విధంగా విద్యా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. పరీక్షలు బాగా రాయాలని వివరించారు. విద్యార్థులకు మెనూ ప్రకారంగా మధ్యాహ్న భోజనం వడ్డించాలని తెలిపారు.
అనంతరం భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిహెచ్ ఆనందమూర్తి , ఉపాధ్యాయులు ఎస్ సత్యనారాయణ, ఎం రమేష్ కుమార్, ఎం అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.