Wednesday, February 18, 2026
Homeవిభజన`విద్వేషమేరాజకీయ పంథా

విభజన`విద్వేషమేరాజకీయ పంథా

- Advertisement -

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై డి.రాజా విమర్శ
కేరళ నన్స్‌ అరెస్టుకు ఖండన

న్యూదిల్లీ: విభజన, విద్వేషమే బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ పంథా అని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. ‘బీజేపీ, ఆర్‌ఎర్‌ఎస్‌ విభజనవిద్వేష రాజకీయం చేస్తున్నట్లు చెప్పడంలో సందేశం లేదు. మతం పేరిట ప్రజలను విభజిస్తున్నాయి. మైనారిటీలపై తీవ్ర దాడులకు పాల్పడుతున్నాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. మానవుల అక్రమ రవాణా, మతమార్పిడి ఆరోపణలతో కేరళకు చెందిన ఇద్దరు నన్స్‌ను చత్తీస్‌గఢ్‌లో అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిరచారు. వారి విడుదలకు డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో చత్తీస్‌గఢ్‌లో ఒక మాట, కేరళలో మరో మాట మాట్లాడుతుండటం బీజేపీ వంచనను బయట పెట్టిందని వ్యాఖ్యానించారు. నన్స్‌ విడుదల కోసం కేంద్ర హోంమంత్రితో భేటీకి సీపీఐ ఎంపీలు యత్నిస్తున్నారని రాజా తెలిపారు. సీపీఐ`సీపీఎం బృందం చత్తీస్‌గఢ్‌లో పర్యటించినట్లు తెలిపారు. బాధితులను సీపీఐ ఎంపీలు, మహిళా నాయకులు కలిశారని చెప్పారు. ఈ వ్యవహారాన్ని కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంపీలు ప్రయత్నిస్తున్నారని, కేంద్ర స్పందన ఎలా ఉంటుందో చూద్దామని డి.రాజా అన్నారు.
ఆక్షేపణీయం: అనీరాజా, సునీర్‌
చత్తీస్‌గఢ్‌లో ఇద్దరు నన్స్‌ అరెస్టు, గిరిజనులపై దాడుల సీపీఐ కార్యదర్శి అనీరాజా, ఎంపీ పీపీ సునీర్‌ ఖండిరచారు. సీపీఐ దిల్లీ కేంద్ర కార్యాలయం అజయ్‌ భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ సీపీఐ, సీపీఎం, కేసీఎం నాయకుల బృందం చత్తీస్‌గఢ్‌లో పర్యటించిందని, బాధితులను కలిసిందని చెప్పారు. ఆర్‌పీఎఫ్‌, బజరంగ్‌ దళ్‌ గూండాలు వేధించిన బాధితులను తాము కలవకూడదని అక్కడి యంత్రాంగం పదేపదే ప్రయత్నించిందన్నారు. బలవంతంగా మతమార్పిడి చేశారని, ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లారని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ గిజరన యువకులు, ముగ్గురు బాలికలపై బజరంగ్‌ దళ్‌ గూండాలు భౌతిక దాడి చేశారని వెల్లడిరచారు.ఇద్దరు సన్యాసినులను విడుదల చేయాలని కేరళలో వాణి వినిపిస్తూ, వారి పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌లో మాత్రం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, దీంతో బీజేపీ నిజ రూపాన్ని బహిర్గతమని అనీరాజా వ్యాఖ్యానించారు. క్రైస్తవులు, మతపరమైన సంప్రదాయాలపై బీజేపీ దాడి చేయడం సిగ్గుచేటని సునీర్‌ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మణిపూర్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లో మైనారిటీలపై దురాగతాలు పెరిగాయన్నారు. ఘటన జరిగిన వెంటనే సీపీఐ ఎంపీ సంతోశ్‌ కుమార్‌, అనీరాజా చత్తీస్‌గఢ్‌ వెళ్లి రాయ్‌పూర్‌ ఆర్చ్‌బిషప్‌ విక్టర్‌ హెన్రీ ఠాకూర్‌ను కలిసి, పార్టీ తరపున సంపూర్ణ మద్దతు, సంఫీుభావం తెలిపినట్లు వెల్లడిరచారు. ఇద్దరు నన్స్‌తో పాటు జైల్లో మగ్గుతున్న గిరిజన యువతను తక్షణమే విడుదల చేయాలని, వారిపై అక్రమ కేసులు కొట్టివేయాలని డిమాండ్‌ చేశారు. మైనారిటీల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ, వారిపై వేధింపులు, వివక్షకు వ్యతిరేకంగా పార్లమెంటుతో పాటు వీధుల్లోనూ సీపీఐ గళం వినిపిస్తుందని అనీరాజా, సునీర్‌ వెల్లడిరచారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు