పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జేవి. సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకులుగా డి. మల్లికార్జున, అలాగే పాలిటెక్నిక్ లో మ్యాథమెటిక్స్ అధ్యాపకులు బి. ప్రదీప్ కుమార్ లకు డాక్టరేట్లు పొందడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ జెవి. సురేష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అధ్యాపకులు మల్లికార్జున ఆర్గానిక్ డై ఇంటర్ లేయర్ ను ఉపయోగించి ఎన్డీఈ ఆధారిత సేంద్రీయ అకర్పణ హెటరో స్ట్రక్చర్ కారక్టరైజేషన్ అనే అంశంపై పరిశోధన చేయడం జరిగిందని, ఈ అంశముపై చేసిన పరిశోధనకు గాను ఆయన యోగివేమన విశ్వవిద్యాలయం చే డాక్టరేట్ పొందడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రదీప్ కుమార్ అధ్యాపకులు కూడా హీట్ ట్రాన్స్ఫర్ ఎనాలసిస్ ఆఫ్ హైబ్రిడ్ నానో ఫ్లూయిడ్స్ విత్ రేడియేషన్ అండ్ ఎం. హెచ్. డి. అను అంశముపై చేసిన పరిశోధనకు గాను యోగివేమన విశ్వవిద్యాలయం వారిచే డాక్టర్ను పొందడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఆ ఇద్దరు ఆధ్యాపకులను ప్రిన్సిపాల్ సురేష్ బాబు, హెడ్స్ బాలస్వామి, అధ్యాపకులు కళ్యాణి, హరిబాబు, బాల జోషి, పరమేశ్వర్ రెడ్డి, రాజేష్ తో పాటు బోధ నేతర సిబ్బంది కళాశాల విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ అధ్యాపకులకు డాక్టరెట్ లు ప్రధానం
RELATED ARTICLES