Homeజిల్లాలుశ్రీ సత్యసాయిదస్తావేజు లేఖరుల పెన్ డౌన్ విరమణ

దస్తావేజు లేఖరుల పెన్ డౌన్ విరమణ

- Advertisement -


విశాలాంధ్ర -ధర్మవరం ;రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 ను వ్యతిరేకిస్తూ జూలైనెల 20వ తారీకు నుండి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరులు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది చివరి రోజు పెన్డౌన్ కార్యక్రమం 11 రోజులు కావడంతో దీక్షను కొనసాగించి అనంతరం విరమించారు. అనంతరం దస్తావేజు లేఖరులు మాట్లాడుతూ ఈ దీక్షతో సంఘీభావంగా స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు వచ్చి దస్తావేజులేఖరులకు మద్దతు తెలపడం జరిగింది అని తెలిపారు. జీవో నెంబర్ 396 రద్దు చేయాలని ఆర్ఎస్కే విధానాన్ని కూడా ప్రవేశపెట్టకుండా దస్తావేజు లేఖరులను ఆదుకోవాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెకు సంఘీభావంగా వైయస్సార్ సిపి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా ఈ పెన్ డౌన్ కార్యక్రమానికి ఎస్సీ జన సంఘం నాయకులు బీఎస్పీ నాయకులు వారి బృందంతో కలిసి సంఘీభావం తెలిపారు అన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుండి యధావిధిగా దస్తావేజులేఖరులు వారి విధులను నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో దస్తావేజులేఖర్ల సంఘం అధ్యక్షులు జావేద్, ఉపాధ్యక్షులు భాస్కర్, సెక్రటరీ మహేంద్ర ,జాయింట్ సెక్రెటరీ నాగార్జున, ట్రెజరర్ మల్లికార్జున, దస్తావేజులేఖర్లు వారి సహాయకులు డిటిపి ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు