- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం మార్కెట్ యార్డులోని ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈ నెలవారీ తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంల భద్రత విషయంలో రాజీ పడకూడదని, 24/7 పటిష్టమైన నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. గోడౌన్ వద్ద భద్రతా చర్యలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డి,ధర్మవరం తహసీల్దార్ దేవరాజు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


