Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎస్ ఐ ఆర్ – 2026 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ

ఎస్ ఐ ఆర్ – 2026 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ

- Advertisement -


ఆర్డీవో రామ భూపాల్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ, కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించడం జరిగిందని ఆర్డిఓ రామ భూపాల్ రెడ్డి తెలిపారు. అనంతరం మాట్లాడుతూధర్మవరం అసెంబ్లీ నియోజక వర్గంలో జులై 1వ తేదీ అర్హత తేదీగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియలో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలు జులై 31వ తేదీన ప్రచురించడం జరిగిందని తెలిపారు.,
ముసాయిదా ఓటర్ల జాబితాలను సంబంధిత పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల నమోదు అధికారి (ERO), సహాయ ఎన్నికల నమోదు అధికారులు, కార్యాలయాలలో , ఇతర నిర్దేశిత ప్రదేశాలలో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచడం జరిగింది అని తెలిపారు. అలాగే, ప్రజల సౌకర్యార్థం ముసాయిదా ఓటర్ల జాబితాలు అధికారిక ఎన్నికల పోర్టల్‌లో కూడా అందుబాటులో ఉంచబడతాయి అని తెలిపారు మే 25వ తేదీ నాటికి ఓటర్లు జులై 31వ తేదీ నాటికి ఓటర్లు తొలగించబడిన ఓటర్లు, అర్హత కలిగిన ప్రతి పౌరుడు ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు, చిరునామా, ఇతర ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని వారు తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ తమ పేరు ముసాయిదా ఓటర్ల జాబితాలో లేకపోయినట్లయితే లేదా ఓటరు వివరాలలో ఏవైనా తప్పులు/లోపాలు ఉన్నట్లయితే, ఎస్ ఐ ఆర్–2026 షెడ్యూల్‌లో నిర్దేశించిన గడువులో సంబంధిత బి ఎల్ వో లు, ఏ ఈ ఆర్ వో లకు క్లెయిమ్‌లు అభ్యంతరాలను సమర్పించవచ్చు అని తెలిపారు.
ప్రజలు క్రింది అంశాలకు సంబంధించి దరఖాస్తులు సమర్పించవచ్చు అని తెలిపారు.క్లెయిమ్‌లు అభ్యంతరాల దాఖలుకు సంబంధించి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలను అందించడంతో పాటు, సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా సంబంధిత బి ఎల్ ఓ లకు, ఏ ఈ ఆర్ వో లకు తగిన సూచనలు జారీ చేయబడినవి తెలిపారు.అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు , ప్రజలు ఈ సవరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొని, అర్హులైన ఓటర్ల పేర్ల చేర్పు లేదా ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలు/తప్పులను సంబంధిత ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు , ఓటరు వివరాలను పరిశీలించుకుని, తమ వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని వారి స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు