- Advertisement -

కీలక జలమార్గాలపై త్వరలో పూర్తి నియంత్రణ సాధిస్తాం.. ట్రంప్ సంచలన ప్రకటన

ఇరాన్‌కు అణ్వాయుధం దక్కనివ్వబోమని స్పష్టీకరణ
యుద్ధ ప్రభావంతో ఇంధన ధరలు పెరగవచ్చని అంగీకారం
ఇరాన్‌ నౌకా, వైమానిక శక్తి బలహీనపడిందని వ్యాఖ్య
ఇరాన్‌ అణ్వాయుధం పశ్చిమాసియాకు ముప్పు అని హెచ్చరిక
ఇరాన్‌కు చెందిన కీలక జలమార్గాలపై అమెరికా ఇప్పటికే గణనీయమైన నియంత్రణ సాధించిందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. త్వరలో పూర్తి నియంత్రణ తమ చేతికి వస్తుందని అన్నారు. అదే సమయంలో ఇరాన్‌ అణ్వాయుధాన్ని తయారు చేయనివ్వబోమని మరోసారి స్పష్టం చేశారు.

మాజీ వ్యక్తిగత న్యాయవాది మైఖేల్‌ కోహెన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ జలమార్గాల గురించి మాట్లాడుతున్నారన్నది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు.

ఇరాన్‌పై సైనిక చర్యల కారణంగా అమెరికన్లకు పెట్రోల్‌, ఇంధన ధరలు కొంత పెరగవచ్చని కూడా అంగీకరించారు. అయినా ఇరాన్‌ను అణ్వాయుధం తయారు చేయకుండా అడ్డుకోవడం మరింత ముఖ్యమని చెప్పారు.

ఇరాన్‌ నౌకాదళం, వైమానిక దళం తీవ్రంగా బలహీనపడ్డాయని ట్రంప్‌ పేర్కొన్నారు. అక్కడి కీలక నాయకులు కూడా లేకపోవడంతో చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకోవడం కష్టంగా మారిందన్నారు.

ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్ల తయారీ సామర్థ్యం భారీగా దెబ్బతిందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. ద్రవ్యోల్బణం పెరగడం, కరెన్సీ విలువ పడిపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు.

ఇరాన్‌ అణ్వాయుధం తయారుచేసే దశకు కేవలం రెండు వారాల దూరంలో ఉందని తమకు సమాచారం ఉందని ట్రంప్‌ చెప్పారు. అందుకే ఇరాన్‌ అణు కేంద్రాలపై బీ-2 బాంబర్లతో దాడి చేశామని తెలిపారు. ప్రతి బాంబు లక్ష్యాన్ని ఛేదించిందని పేర్కొన్నారు.

ఇరాన్‌ వద్ద అణ్వాయుధం ఉంటే ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా దేశాలకు భారీ ముప్పు ఉండేదని ట్రంప్‌ అన్నారు. ఇజ్రాయెల్‌ భద్రతలో తన పాత్ర కీలకమని కూడా వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు