Saturday, January 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛంద సంస్థ చేయూత

అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛంద సంస్థ చేయూత

విశాలాంధ్ర ధర్మవరం ; అంగన్వాడీ కేంద్రాలను ప్లేస్కూల్ మోడల్గా మార్చేందుకు తమ సంస్థ సహాయ సహకారాలు అందిస్తోందని మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ ఛైర్మన్ లక్ష్మిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సత్యసాయినగర్ అంగన్వాడీ కేంద్రంలో గురువారం ఎస్బిఐ పాన్ ఇండియా సీఎస్ఆర్ యాక్టివిటిస్ సహకారంతో మిత్ర హొలిస్టిక్ హెల్త్ సొసైటీ ఛైర్మన్ లక్ష్మిరెడ్డి అంగన్వాడీ కేంద్రానికి ఆట వస్తువులు, బుక్స్, బాటిళ్లు, టీవీ, రైస్ కుక్కర్ను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు ఆడుతూ పాడుతూ విద్యను అందించేందుకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. సొసైటీ తరపున ఇప్పటి వరకు రాష్ట్రంలోని 60 అంగన్వాడీ కేంద్రాలకు ఆట వస్తువులు, వివిధ రకాల వస్తువులు అందించామని తెలిపారు. కేంద్రంలోని పిల్లలు, టీచర్లు వాటిని సద్వినియోగం చేసుకుని పిల్లలకు మంచి విద్యను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయినగర్ అంగన్వాడీ కేంద్రం టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు