Monday, March 31, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅయ్యప్ప స్వామి దేవాలయమునకు లక్ష రూపాయలు విరాళం

అయ్యప్ప స్వామి దేవాలయమునకు లక్ష రూపాయలు విరాళం

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మిస్తున్న శుభ సందర్భంగా 16వ వార్డ్ కౌన్సిలర్ కేతాలోకేష్ తనవంతుగా కుటుంబం తరఫున ఒక లక్ష రూపాయలు విరాళమును అయ్యప్ప స్వామి ఆలయ గురుస్వామి విజయ్ అందజేశారు. గురు స్వామి విజయ్ మాట్లాడుతూ ఇప్పటికే కౌన్సిలర్ అయ్యప్ప స్వామి వారి విగ్రహానికి పూత కార్యక్రమంలో వెండి బంగారం అందజేయడం జరిగిందని తెలిపారు. కౌన్సిలర్ ఉదార భక్తికి సందర్భంగా కౌన్సిలర్ కు గురుస్వామి కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం వారి పేరిటన పూజలు కూడా నిర్వహించారు. కౌన్సిలర్ మాట్లాడుతూ తర్వాత కుటుంబం తరఫున దాతగా తాను ముందుకు రావడం, ఆర్థిక సహాయం అందించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు