విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల శ్రీ కాశీ విశాలాక్షి సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయమునకు షెడ్ లేకపోవడంతో భక్తాదులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఆలయ అర్చకులు ద్వారకనాథ్ శర్మ దాతల దృష్టికి తీసుకొని వెళ్లారు. దీంతో దాతలైన కీర్తిశేషులు నిమ్మ నారాయణమ్మ ఈశ్వరప్పల కుమారుడు నిమ్మ చంద్రశేఖర్, ధర్మపత్ని నాగమణి, కుమారుడు వినయ్ సాయి నేరుగా షెడ్డు నిర్మించి ప్రధాన అర్చకులు ద్వారకనాథ్ శర్మకు స్వాధీనం చేశారు. తదుపరి అర్చకులు దాతల పేరిటన ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయములో దంపతులను వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తాదులు పాల్గొన్నారు.
ఆలయమునకు షెడ్డు నిర్మించిన దాతలు
RELATED ARTICLES