Homeజిల్లాలుఅనంతపురండా. బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత గోపాల్‌కు ఘన సన్మానం

డా. బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత గోపాల్‌కు ఘన సన్మానం

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : బి.ఆర్. అంబేద్కర్ పేరు మీద ప్రదానం చేసే జాతీయ అవార్డు అందుకున్న డి.జి.హెచ్.ఎస్ వ్యవస్థాపకులు గోపాల్‌కు బుధవారం ఉరవకొండలో ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక రోడ్లు-భవనాల అతిథి గృహంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు కౌకుంట్ల రవి, డివిజన్ కార్యదర్శి రామాంజనేయులు మాదిగ నాయకత్వం వహించారు. నాయకులు గోపాల్‌కు పూలమాలలు వేసి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, సమాజ సేవలో గోపాల్ చేసిన కృషిని ప్రశంసించారు. ఆయనకు లభించిన ఈ అవార్డు యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎం. రవి (మాజీ వార్డ్ మెంబర్), బుడబుక్కల గోపాల్, ఎం. కేశవరాజు, ఉండబండ నాగేంద్ర, చాకలి గురుస్వామి, ఉండబండ రాజు, ఎల్లప్ప, ఎర్రి స్వామి, ఎర్రగుంట మాజీ సర్పంచ్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు