శాంతినగర్ మున్సిపల్ స్కూల్ హెడ్మాస్టర్ ఉమాపతి
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించి నాణ్యమైన విద్యను పొందే అవకాశం ఉందని శాంతినగర్ మున్సిపల్ హై స్కూల్ హెడ్మాస్టర్ ఉమాపతి తెలిపారు. ఈ సందర్భంగా వారు బడి పిలుస్తోంది అనే కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు పట్టణంలోని శాంతినగర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ ఉమాపతి మాట్లాడుతూ విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగానే ఈ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతను కూడా వివరించడం జరిగిందని, నిష్ణాతులైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే చక్కటి బోధన ఉంటుందని తెలపడం జరిగిందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో లభించే ఉచిత సదుపాయాలు నాణ్యమైన విద్యను గూర్చి కూడా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి పాఠశాలలో చేరి విద్యను కొనసాగించాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలను చేర్పించండి..
- Advertisement -
RELATED ARTICLES


