Tuesday, December 10, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిహాస్టల్ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేసిన డాక్టర్ బషీర్

హాస్టల్ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేసిన డాక్టర్ బషీర్

విశాలాంధ్ర- ధర్మవరం;; పట్టణములోని సాయి నగర్ లో గల స్పందన ఆసుపత్రి అధినేత డాక్టర్ బషీర్ 58వ జన్మదిన వేడుకల సందర్భంగా పట్టణములోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు లోగల బీసీ హాస్టల్ బాలికలు, ఎస్సీ హాస్టల్ బాలికలు, కోర్ట్ రోడ్డు లో బాలసదన్, దుర్గా నగర్ హాస్టల్, ఎర్రగుంట బీసీ హాస్టల్, ఎస్బిఐ కాలనీ బీసీ హాస్టల్ లోని విద్యార్థినీ విద్యార్థులకు దాదాపు 450 దుప్పట్లను ఆసుపత్రి మేనేజర్ బాబా ఫక్రుద్దీన్, దిల్దార్ సిబ్బంది చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ వార్డెన్లు, విద్యార్థినీ విద్యార్థులు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా దంపతులకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హాస్టల్ వార్డెన్లు మాట్లాడుతూ పట్టణంలో ఉన్నటువంటి స్పందన హాస్పిటల్ సేవా కార్యక్రమాలలో ముందంజలో ఉందని, ఇటీవల విజయవాడలో వరద బాధితులకు వివిధ రూపాలలో డాక్టర్ బషీర్ డాక్టర్ సోనియాల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేయడం సంతోషదాయకమన్నారు. అదేవిధంగా పట్టణంలో బిపి, షుగర్ పరీక్షలను నిర్వహిస్తూ, అందరికీ అవగాహన కల్పించడంలో మంచి గుర్తింపు కూడా పొంది, మంచి వైద్య చికిత్సలను అందించడంలో పట్టణంలోనే ముందంజలో ఉందని తెలిపారు. ఏది ఏమైనా డాక్టర్ బషీద్ దంపతులు విద్య, వైద్య, తదితర అంశాలను తమదైన శైలిలో మానవతా విలువలను పెంచుతూ, జిల్లా, పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క మన్ననలు పొందడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరు హాస్టల్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు