- Advertisement -
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని పీకలబెట్ట గ్రామంలో కురిసిన భారీ వర్షానికి తాగునీటి పైపు లైను కొట్టుకపోయింది. గ్రామ శివారుల్లో ఉన్న తాగునీటి కోసం వేసిన బోరు వద్ద దాదాపు 30 అడుగుల పైపు లైను వరద నీటిలో కొట్టుకొని పోయిందని గ్రామ సర్పంచ్ లక్ష్మి, వైసీపీ నేత మూకిరెడ్డి మంగళవారం తెలిపారు. తాగునీటి సరఫరా కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేశామన్నారు. కొట్టుకపోయిన పైపు లైను మరమ్మతులకు 30 వేల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు.


