Homeజిల్లాలువిజయనగరంతుఫాన్ నేపథ్యంలో రాజాంలో మేజర్ డ్రైన్‌లను శుభ్రపరిచే ప్రత్యేక కార్యక్రమం

తుఫాన్ నేపథ్యంలో రాజాంలో మేజర్ డ్రైన్‌లను శుభ్రపరిచే ప్రత్యేక కార్యక్రమం

- Advertisement -

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : మొంథా తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా రాజాం పట్టణంలో నిరంతర వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండి, మురుగు నీరు బయటకు పొంగి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.సోమవారం సాయంత్రం నుండి మంగళవారం వరకు సానిటరీ ఇన్స్పెక్టర్ చేగొండి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా శ్రీకాకుళం రోడ్డులో ఉన్న మేజర్ డ్రైన్‌లో మురుగు నీరు నిల్వ ఉండడం, చెత్త పేరుకుపోవడంతో జేసిబి సహాయంతో డ్రైన్ పూర్తిగా శుభ్రపరిచే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ జేసిబి యంత్రాన్ని వినియోగించి డ్రైన్‌లోని చెత్త, సిల్ట్ మరియు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.

సానిటరీ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, “తుఫాన్ ప్రభావం కారణంగా వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరుతోంది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. మేజర్ డ్రైన్‌లు, సబ్ డ్రైన్‌లు పూర్తిగా శుభ్రపరిచి వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూస్తున్నాం” అన్నారు.ఈ సందర్భంగా ఆయన పట్టణ ప్రజలను ఉద్దేశించి, చెత్తను రోడ్లపై లేదా డ్రైన్‌లలో వేయకుండా మున్సిపల్ వాహనాల ద్వారా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సానిటరీ మాస్టర్లు, పారిశుధ్య సిబ్బంది, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇలాంటి పారిశుధ్య చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు