Homeఅంతర్జాతీయందుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత

దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత

- Advertisement -


వెనక్కి వచ్చిన ఎమిరేట్స్ విమానం…


దుబాయ్
: పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నడుమ ఇరాన్ దాడులను తీవ్రతరం చేస్తోంది. పలు దేశాలపై ఇరాన్ డ్రోన్‌లతో దాడులు జరుపుతోంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున డ్రోన్ల దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ డ్రోన్ ఇంధన ట్యాంక్‌ను ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాశ్రయంలోని అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేసి, విమానాశ్రయాన్ని మూసివేసినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు, ఎయిర్‌పోర్టు సిబ్బందికి సేఫ్టీ నోటీసు జారీ చేశారు. విమానాల స్టేటస్ తెలుసుకునేందుకు విమానయాన సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు. పలు విమానాలను దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు. ఇంధన ట్యాంక్‌కు అంటుకున్న మంటలను ఆర్పేందుకు దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సమీపంలోని ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంధన ట్యాంక్‌పై దాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలోని కీలకమైన ఇతర మౌలిక సదుపాయాల వద్ద భద్రత పెంచినట్లు అధికారులు వెల్లడించారు.
వెనక్కివచ్చిన ఎమిరేట్స్ విమానం…
కొచ్చి నుంచి సోమవారం తెల్లవారుజామున దుబాయ్ వెళ్లిన ఎమిరేట్స్ విమానం తిరిగి కొచ్చికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అది బయల్దేరిన కొద్దిసేపటి తర్వాత దుబాయ్ విమానాశ్రయం మూసివేసినట్లు సమాచారం అందడంతో విమానాన్ని వెనక్కి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు