Homeఆంధ్రప్రదేశ్డీ ఎన్ ఆర్ మృతి తో మూగబోయిన దుళ్ల

డీ ఎన్ ఆర్ మృతి తో మూగబోయిన దుళ్ల

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : దూడల నాగేశ్వరరావు(66)డీ ఎన్ ఆర్ అంటే ఆ గ్రామానికి ఒక ఆసరా, పెద్ద దిక్కు, కులం, మతం, పార్టీల తో సంబంధం లేకుండా అన్ని వర్గాలు గౌరవించే ప్రజానేత ఆయన. అటువంటి నాయకుని అకాల మృతి తో కడియం మండలం దుళ్ల గ్రామం మూగబోయింది. విషాదంలో మునిగింది . మంగళవారం జరిగిన ఆయన అంత్య క్రియల్లో వందలాది మంది పాల్గొని ఘన నివాళులు అర్పించారు. దుళ్ళ గ్రామం నుండే కాకుండా పరిసర గ్రామాల నుంచి నాయకులు తరలివచ్చి వారి సంతాపాన్ని తెలిపారు. డీ.ఎన్.ఆర్ 4 పదుల రాజకీయ ప్రయాణం లో దుళ్ల గ్రామాభివృద్ధికి ఇతోధికంగా పాటుపడ్డారు. ఒకటే పార్టీ ఒకే అజెండాతో ముందుకు సాగారు. 1996- 2001 మధ్య ఆయన సర్పంచ్ గా పనిచేశారు. తిరిగి ఆయన భార్య దూడల రత్నం 2005-2011 మధ్య సర్పంచ్ గా పనిచేశారు. దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు సహకారంతో దుళ్ళ గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసారు. పాత గ్రామ పంచాయతీ భవనం, పాఠశాలల అభివృద్ధి, గ్రామంలో ప్రధాన రహదారులను, పక్కా కాంక్రీట్ రహదారులుగా మార్చడం లో నాగేశ్వర రావు విశేషంగా కృషి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు