Homeఅంతర్జాతీయంయుద్ధం వేళ…ట్రంప్ ఇన్‌సైడర్ ట్రేడింగ్!

యుద్ధం వేళ…ట్రంప్ ఇన్‌సైడర్ ట్రేడింగ్!

- Advertisement -


రక్షణరంగ కంపెనీల్లో పెట్టుబడులు
అంతర్జాతీయ మీడియా కథనాల్లో వెల్లడి

వాషింగ్టన్: అమెరికా`ఇరాన్ యుద్ధం వేళ ప్రపంచంలో అన్ని వర్గాలు నష్టాలు చవిచూశాయి. కానీ ట్రంప్ కుటుంబానికి మాత్రం లాభాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ కుటుంబ పెట్టుబడులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్‌లో అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. అధ్యక్షుడిగా కొనసాగుతూ కేవలం మూడు నెలల వ్యవధిలోనే మార్కెట్‌లో వేల సంఖ్యలో లావాదేవీలు చేయడం ఇప్పటికే చర్చనీయాంశమైంది. ఇప్ప్పుడు ఆయన ఎంచుకున్న కంపెనీల విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన విధానాలతో నేరుగా ప్రభావితమయ్యే, పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో లాభపడే సంస్థల్లో భారీ ఆర్డర్లు ప్లేస్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆయన ఫోర్ట్‌పోలియోలో అమెరికా ఆయుధ సంస్థలు లాక్‌హీడ్ మార్టిన్, జనరల్ డైనమిక్స్, నార్తరోప్ గ్రూమన్ షేర్లు ఉన్నాయి.
ఇటీవల ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా చైనాకు ఎన్విడియా చిప్‌ల ఎగుమతులపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎగుమతి నిబంధనలను సడలిస్తూ…ఎన్విడియాకు చెందిన అధునాతన చిప్‌లను ఆమోదిత చైనా కస్టమర్లకు విక్రయించడానికి అంగీకరించారు. ఈనేపథ్యంలో ట్రంప్ కుటుంబం 6 మిలియన్ల డాలర్ల మేరకు ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేశారు. అయితే ట్రంప్ కుటుంబ వ్యాపారాలను చూస్తున్న ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ… అధ్యక్షుడి పోర్ట్‌ఫోలియోను థర్డ్ పార్టీలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. ‘షేర్లు ఈ కంపెనీల్లోనే కొనాలి…వాటినే ఎంచుకోవాలి అని ట్రంప్ కానీ, ఆయన కుటుంబం, ట్రంప్ ఆర్గనైజేషన్ నుంచి కానీ ఎలాంటి సూచనలు అందవు’ అని ఆ ప్రతినిధి తెలియజేశారు.
తమ సంతకాలతో ప్రభావితమయ్యే కంపెనీల్లో ట్రేడింగ్‌కు అమెరికా అధ్యక్షుడు దూరంగా ఉంటారు. మామూలుగా అమెరికా ఉద్యోగులు తమ ప్రభుత్వ విధానాల వల్ల ప్రభావితమయ్యే ఆస్తులను కలిగి ఉండటానికి ఆ దేశ చట్టాలు అనుమతించవు. కానీ ఈ విషయంలో అధ్యక్షుడికి మాత్రం మినహాయింపు ఉంటుంది. అయితే అధ్యక్షుడి పెట్టుబడులు ఏఏ రంగాల్లో ఉన్నాయో తెలియడమే ఇక్కడ సమస్య అని ఎథిక్స్ అధికారులు అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇవి అధ్యక్షుడి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు