ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. తొలుత కేటాయించిన విచారణ తేదీకి బదులుగా కొత్త తేదీ ఇవ్వాలని ఆయన కోరడంతో, ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఈడీ తాజా నోటీసుల్లో పేర్కొంది. మద్యం రవాణా కాంట్రాక్టులు, సబ్‌కాంట్రాక్టుల కేటాయింపులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేసే రవాణా వ్యవస్థలో జరిగినట్లు ఆరోపణలున్న అక్రమాలపై ఈ కేసు నమోదైంది. 2020లో జారీ చేసిన కేంద్రీకృత రవాణా టెండర్, తదనంతరం కాంట్రాక్టులు, సబ్‌కాంట్రాక్టుల కేటాయింపులే దర్యాప్తులో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
అంబటి రాంబాబుకు మరోసారి ఈడీ నోటీసులు
- Advertisement -
RELATED ARTICLES


