Homeఆంధ్రప్రదేశ్వారంలో బిహార్‌లో మూడో ఘటన.. మరో యువతిని వేధించిన వీడియో వైరల్‌!

వారంలో బిహార్‌లో మూడో ఘటన.. మరో యువతిని వేధించిన వీడియో వైరల్‌!

- Advertisement -


మందార్‌ హిల్‌లో యువతిపై ఆకతాయిల వేధింపులు
ఘటన ఏప్రిల్‌లో జరిగి ఉండొచ్చంటున్న పోలీసులు
నిందితులను గుర్తించే పనిలో ఉన్న పోలీసులు

బిహార్‌లో యువతుల వేధింపులకు సంబంధించిన వీడియోలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. జముయి, సమస్తిపూర్‌ జిల్లాల్లో ఇలాంటి ఘటనలు వెలుగుచూసిన కొన్ని రోజులకే.. ఇప్పుడు బంకా జిల్లాలో మరో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వారం రోజుల్లోనే బిహార్‌లో ఇది మూడో ఘటనగా నిలిచింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.బంకా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మందార్‌ హిల్‌లో ఓ యువతిని కొందరు యువకులు వేధిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు పోలీసులు తెలిపారు. సోషల్‌ మీడియా సెల్‌కు వాట్సాప్‌ ద్వారా వీడియో అందడంతో అధికారులు దృష్టి సారించారు.

బౌన్సీ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో పంకజ్‌ కుమార్‌ ఝా ఆధ్వర్యంలో పోలీసులు మందార్‌ హిల్‌కు వెళ్లి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. వీడియో మందార్‌ హిల్‌లోనే చిత్రీకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. అయితే వీడియో ఇటీవలిది కాదని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

వీడియోలో ఆరుగురు నుంచి ఏడుగురు యువకులు ఉన్నట్లు గుర్తించారు. వారి వివరాలు, యువతి గుర్తింపును ఇప్పటివరకు పోలీసులు నిర్ధారించలేకపోయారు. స్థానిక గ్రామస్థులు, దుకాణదారులను విచారిస్తూ నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

ఎస్‌హెచ్‌వో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బౌన్సీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. గుర్తుతెలియని నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని 74, 75, 76, 3(5) సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 66ఈ, 67ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీడియోను ఆధారంగా చేసుకున్న పోలీసులు.. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చిత్రీకరించారు? ఎవరు సోషల్‌ మీడియాలోకి పంపించారనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

వీడియోను మరింతగా షేర్‌ చేయవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువతిని గుర్తించేలా ఉండే ఎలాంటి సమాచారాన్ని కూడా ప్రచారం చేయొద్దని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు