Homeఅంతర్జాతీయంఎలాన్ మస్క్ నూతన ఆవిష్కరణ..

ఎలాన్ మస్క్ నూతన ఆవిష్కరణ..

- Advertisement -

పుట్టుకతో చూపు లేని వ్యక్తులు కూడా చూడగలిగేలా చేసే బ్రెయిన్ ఇంప్లాంట్‌ను కలిగే భవిష్యత్తు ఇప్పుడే దాదాపుగా నిజమవుతోంది.ఎలాన్ మస్క్ స్థాపించిన కాలిఫోర్నియా సంస్థ న్యూరాలింక్ఈ మార్గంలో కీలక అడుగులు వేస్తోంది.సంస్థ 2026లో తొలిసారిగా మనుషులపై బ్లైండ్‌సైట్ ఇంప్లాంట్ పరీక్షలను ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.బ్లైండ్‌సైట్ బ్రెయిన్ చిప్‌ను పుట్టుగుడ్డి వారికి కనీస స్థాయి చూపును అందించడానికి రూపొందించారు.ఈ పరికరానికి 2024 సెప్టెంబర్‌లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ బ్రేక్‌థ్రూ డివైస్ గుర్తింపు కల్పించింది. ఈ గుర్తింపు, ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో ఉపయోగపడే వైద్య పరికరాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఇస్తారు.

పరిశోధనలో నూతన అధ్యాయం
ఇప్పుడు బ్లైండ్‌సైట్‌కు ఈ గుర్తింపు రావడం పరిశోధనలో కొత్త మైలురాయి.
గతేడాది మార్చిలో ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో బ్లైండ్‌సైట్ ఇప్పటికే కోతుల్లో పనిచేస్తోందని ప్రకటించారు.ప్రారంభంలో పరికరపు రిజల్యూషన్ తక్కువగా ఉండవచ్చని, కానీ భవిష్యత్తులో సాధారణ చూపును మించిన స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు.
2026 ప్రారంభానికి న్యూరాలింక్ బ్లైండ్‌సైట్‌ను తొలిసారిగా మనుషుల మెదడులో అమర్చేందుకు సిద్ధమవుతుందని, పుట్టుకతోనే చూపు లేని వ్యక్తులకు కనీస స్థాయి చూపును అందించడమే దీనిప్రధాన లక్ష్యమని మస్క్ చెప్పారు. జనవరి 1న ఆయన మరోసారి ఈ ప్రాజెక్టుపై ఎక్స్‌లో వివరిస్తూ, న్యూరాలింక్ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ పరికరాలను భారీ స్థాయిలో తయారు చేయడం ప్రారంభిస్తామని, భవిష్యత్తులో పూర్తిగా ఆటోమేటెడ్ శస్త్రచికిత్స విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.

పుట్టుగుడ్డి వ్యక్తుల్లో కూడా చూపును తిరిగి తెచ్చే అవకాశం
బ్లైండ్‌సైట్ పరికరంలోని సన్నని తంతువులు, మెదడు మరియు స్పైనల్ కార్డ్‌ను కప్పే గట్టి పొర ఃడ్యూరాఃను తొలగించకుండానే అంతర్గతంగా చేర్చగలగడం ప్రత్యేకత.కళ్ళు, ఆప్టిక్ నర్వ్ కోల్పోయిన వారు కూడా దీని సహాయంతో చూడగలరని మస్క్ చెప్పారు. మెదడులో విజువల్ కార్టెక్స్ సరిగా ఉన్న పుట్టుగుడ్డి వ్యక్తుల్లో కూడా చూపును తిరిగి తెచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రారంభంలో ఈ పరికరం చూపించే దృశ్యాలు పాత అటారి వీడియో గేమ్స్‌లా తక్కువ నాణ్యతతో ఉంటాయి, కానీ ఇది క్రమంగా అభివృద్ధి చెందుతుందని మస్క్ చెప్పారు.మరోవైపు బ్లైండ్‌సైట్ వంటి పరికరాల భద్రత, పనితీరుపై శాస్త్రవేత్తల వర్గాల్లో ఇంకా అనుమానాలున్నాయి. ఇవి నిజంగా ఎంతవరకు సురక్షితమో, ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయో కాలమే తేల్చనుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు