Homeఆంధ్రప్రదేశ్రమాదేవి ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు

రమాదేవి ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు

- Advertisement -

అనపర్తిలో అత్యవసర వైద్యసేవలకు శ్రీకారం 

రమాదేవి ఆసుపత్రి అధినేత డాక్టర్ ఎమ్ .రమాదేవి 

  విశాలాంధ్ర –  అనపర్తి: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం అత్యవసర వైద్యసేవలు అందుబాటులోకి తీసుకు రావాలనే సంకల్పంతో స్థానిక రమాదేవి ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలను ప్రారంభిస్తున్నట్టు ఆసుపత్రి అధినేత , గైనకాలజిస్ట్ , లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ఎమ్ .రమాదేవి తెలిపారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అనపర్తి ,  పరిసర గ్రామీణ ప్రాంతాల్లో మొదటిసారిగా అత్యవసర వైద్య సేవలను సమగ్రంగా అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ సేవలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో డాక్టర్ రమాదేవి వివరించారు. అత్యవసర విభాగంలో 24 గంటలు  అంబులెన్స్ సదుపాయం కూడా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. ఇటీవలే అనపర్తి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మెడికల్  సూపరింటెండెంట్ డాక్టర్ తాడి రామగుర్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించామన్నారు. అలాగే అనుభవజ్ఞులైన డా. కృష్ణ కిశోర్ నాయక్ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ & క్రిటికల్ కేర్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని, ఈ విభాగంలో అత్యాధునిక వెంటిలేటర్లు, మెడికల్ మానిటర్లు వంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామన్నారు . ప్రతి ఒక్కరికీ అధునాతన  వైద్య సేవలను అందించాలనే సంకల్పంతో, త్వరలోనే 200 పడకల సామర్థ్యంతో రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించబోతున్నామని,  అన్ని ఆరోగ్య సమస్యలకు సమగ్ర వైద్యం అందించడం  తమ ప్రధాన లక్ష్యంగా రమాదేవి తెలిపారు. ఈ సమావేశంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు