రామవరం గ్రామదేవత బాపనమ్మ తల్లి దర్శించిన ‘ధర్మో రక్షితి రక్షితః’ సినిమా టీమ్.
విశాలాంధ్ర – అనపర్తి : అనపర్తి మండలంరామవరం గ్రామదేవత బాపనమ్మ తల్లి అమ్మవారిని ‘ధర్మో రక్షితి రక్షితః’ సినిమా యూనిట్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కట్టా శ్రీకర ప్రసాద్, కన్నడ నటి చైత్రా శివన్న, చిత్ర నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్ తదితరులు అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.జగపతిబాబు, రావు రమేష్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ను ఈ నెలలో పూర్తి చేయనున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు.సినిమానుజనవరి–ఫిబ్రవరి మధ్యలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నట్టు వారు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సబ్బెళ్ల శ్రీనివాసరెడ్డి (బొచ్చు శ్రీను), మల్లిడి సురేంద్ర రెడ్డి, కొండపల్లి సత్యనారాయణ, సబ్బెళ్ల తిరపారెడ్డి, కర్రి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


