- Advertisement -
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏవో సోమశేఖర్
విశాలాంధ్ర – నల్లజర్ల : నల్లజర్ల మండలంలో 14 రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ శాఖ అధికారి బి సోమశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 613 మంది రైతుల నుండి 682 టన్నులు ధాన్యాన్ని సేకరించామని వాటి విలువ 14 .45 కోట్లు ఉంటుందని అన్నారు. రైతులకు వారి బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అవుతుందని తెలిపారు మొత్తం 12 టన్నుల ధాన్యం సేకరణ జరుగుతుందని. రైతులకు వారి అకౌంట్లోకి సక్రమంగా నగదు పడటంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారి బి సోమశేఖర్ తెలిపారు.


