Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆర్టీసీ పరిరక్షణ కార్యక్రమంలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన..

ఆర్టీసీ పరిరక్షణ కార్యక్రమంలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన..

- Advertisement -

డిపో జేఏసీ కన్వీనర్లు నాగార్జున రెడ్డి ముత్యాలప్ప
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ ఉద్యోగులు, జులై 7 వ, 8వ తేదీలలో ఆర్టీసీ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రధాన సమస్యలపై నల్ల బ్యాడ్జీలు ధరించి రెండవ రోజు కూడా ఆర్టీసీ ఉద్యోగులు తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా డిపో జేఏసీ కన్వీనర్లు నాగార్జున రెడ్డి, ముత్యాలప్ప మాట్లాడుతూ విద్యుత్ బస్సుల కొనుగోలు, మెయింటెన్స్, విధుల నిర్వహణ ఆర్టీసీ సంస్థ ద్వారానే చేపట్టాలని, ప్రైవేట్ విద్యుత్ బస్సుల సాకుతో మూసివేసిన డిపోలను వెంటనే తెరిపించాలని వారు డిమాండ్ చేశారు. శ్రీ శక్తి స్కీం జీరో టికెట్ మొత్తాన్ని ప్రభుత్వ సంస్థకు చెల్లించాలని, నాలుగు వేలు బస్సులు కొనుగోలు చేసి 15 వేల ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ శక్తి స్కీమ్ అమలులో సిబ్బంది మహిళా ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని తెలిపారు. జేఏసీ మెమోరాండంలోని డిమాండ్లను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రైవేట్ విద్యుత్ బస్సులు మనకొద్దు-ఆర్టీసీ విద్యుత్ బస్సులే ముద్దు అన్న నినాదాలు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో
జేఏసీ నాయకులు ముస్తఫా, మధుసూదన్, నజీర్ సాహెబ్, వైవియన్ రెడ్డి, నరసింహులు, మురళి నాయక్, మంజు, బాబు, రామకృష్ణ, తిరుమలేష్, ఆది, శివమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు