Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఏ డి ఏ శ్రీ ఎల్ లక్ష్మణ్ నాయక్

ఏ డి ఏ శ్రీ ఎల్ లక్ష్మణ్ నాయక్

- Advertisement -

పిఎండిఎస్ విధానాన్ని ఆచరించి జీవవైవిధ్యాన్ని పెంపొందించుకొండి

విశాలాంధ్ర ధర్మవరం:: పిఎండిఎస్ విధానాన్ని ఆచరించి జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకోవాలని వ్యవసాయ ఏడిఏ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం మండల పరిధిలోని మల్కాపురం గ్రామం నందు రైతు శ్రీ పక్కిరప్ప పొలంను వారు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రకృతి సేద్యంలో భాగంగా విత్తన గుళికలు తయారు చేసి 2 ఎకరాలలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ చేయడం జరిగింది అని తెలిపారు. ఈ విధానం వల్ల ఉపయోగాలు రైతులకు వివరించడం జరిగింది అని తెతెలిపారుఈ విధానంలో ఐదు ప్రధానమైన పంటలతో పాటు దాదాపు 25 రకాల జీవవైవిద్య పంటలకు చెందిన విత్తనాలను బీజామృతంతో కడిగి బంకమన్ను, ఘనజీవామృతము బూడిదలతో పొరలుగా అంటించి ఆరబెట్టిన తర్వాత గొర్రుతో లేదా వెదజల్లడం ద్వారా విత్తడం జరుగుతుంది అని తెలిపారు. పెల్లటైజేషన్ చేసిన విత్తనాలు తేలికపాటి వర్షం పడినా మొలకెత్తుతాయని తెలిపారు. విత్తనాలు తేమను ఎక్కువ నిలువ చేసుకోవడం వల్ల త్వరగా మొలకెత్తడమే కాకుండా పక్షుల ఇతర కీటకాల నుంచి కొంతవరకు రక్షణ పొందుతాయన్నారు. ప్రారంభ దశలో మొక్కల ఎదుగుదల బలంగా ఉండడంతోపాటు నేలలో సూక్ష్మజీవుల కార్యకలాపాలు పెరిగి నేల మెరుగుపడుతుందని తెలిపారు. మల్కాపురం గ్రామంలో అమలవుతున్న పంట నమోదు కార్యక్రమాన్ని రాజ్యసభ కేంద్ర సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది అని తెలిపారు. అలాగే పంట సాగు చేసినా రైతు సోదరులందరూ తప్పనిసరిగా ఖరీఫ్ 2026 సంబంధించి పంట నమోదు చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముస్తఫా, బీటీఎం ప్రతిభ, వీహెచ్ఎ గోట్లు రాశాజ్యోతి,వ్యవసాయ సిబ్బంది ఆదినారాయణ, పక్కీరప్ప, నాగరత్న, గ్రామ రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు