Saturday, February 22, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఉపాధి మార్గాలు

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఉపాధి మార్గాలు

విశాలాంధ్ర -తనకల్లు : మహిళలు ఆర్థికంగా ఎదిగి పలువురికి ఉపాధి చూపే మార్గమే షేడ్ నెట్ కార్యక్రమం అని జిల్లా ఆర్టికల్చర్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక చౌడేశ్వరి మండల మహిళా సమాఖ్యకార్యాలయంలో తనకల్లు నల్లచెరువు మండలాల రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా షేడ్ నెట్ కార్యక్రమాన్ని విస్తరింప చేయాలనే ఆలోచనతో నాబార్డ్ సంస్థ ద్వారా నిధులు మంజూరయ్యాయని షేడ్ నెట్ లను ఉపయోగించి కూరగాయలు ఆకుకూరలు పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు హార్టికల్చర్ అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉద్యాన శాఖ ద్వారా ఏ పంటలకు ఏ ఏ రాయితీలు వస్తాయనే విషయాలను వివరించారు. సంఘాల సభ్యుల ద్వారా షెడ్ నెట్ ను ఉపయోగించుకొని పంటలు పండించి వీరు లబ్ధి పొందడమే కాక ఇతరులకు ఉపాధి చూపేందుకు ఆస్కారం ఉందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంఘ సభ్యులతో పాటు సిబ్బంది చొరవ తీసుకొని పనిచేయాలని పిడి నరసయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో డీపీఎం రామ్మోహన్ ఏరియా కోఆర్డినేటర్ రవీంద్ర ఏపీఎంలు రమణప్ప జయంతి మండల హార్టికల్చర్ అధికారి లావణ్య టిడిపి మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి సంస్థ ప్రతినిధి గణేష్ జన జాగృతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు