Sunday, December 22, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిదివ్యాంగులకు ప్రత్యేక నోడల్ పాయింట్ ఏర్పాటు.. ఎంపీడీవో సాయి మనోహర్

దివ్యాంగులకు ప్రత్యేక నోడల్ పాయింట్ ఏర్పాటు.. ఎంపీడీవో సాయి మనోహర్

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇకనుంచి దివ్యాంగులకు ప్రత్యేకంగా నోడల్ పాయింట్ కేంద్రమును ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో దివ్యాంగులు అన్ని ప్రభుత్వ రంగాలలో ప్రతిభ ఘనపరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. అందుకనే మన ధర్మారం మండలంలో కూడా దివ్యాంగులకు సమస్యలను పరిష్కరించుటలో నా వంతుగా కృషి చేస్తానని తెలిపారు. కావున మండల పరిధిలో ఉన్నటువంటి దివ్యాంగులకు సామాజిక ఆర్థిక ఇతర సమస్యలు ఏవైనా ఉన్నచో అర్జీ ద్వారా తెలపవచ్చునని తెలిపారు. మీ అర్జీని ఏ రోజుకు ఆ రోజు విచారణ జరిపి సాధ్యమైనంత వరకు పరిష్కరించేందుకు కూడా తాను కృషి చేస్తానని తెలిపారు. ఇందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించడం జరిగిందని, తప్పనిసరిగా దివ్యాంగులకు న్యాయం జరిగే విధంగా తాను కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగులు అభివృద్ధి బాటలో నడిపినప్పుడే సుస్థిర అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని మండలంలోని దివ్యాంగుల అందరూ కూడా తప్పనిసరిగా సద్వినియోగం చేసుకొని, తమ సమస్యలను పరిష్కారం చేసుకొని, సుఖవంతమైన జీవితమును గడపాలని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు