Friday, December 27, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎయిడ్స్ పట్ల అందరూ అవగాహన చేసుకోవాలి..

ఎయిడ్స్ పట్ల అందరూ అవగాహన చేసుకోవాలి..

శక్తి మైత్రి మహిళా సంఘం స్వచ్ఛంద సంస్థ
విశాలాంధ్ర ధర్మవరం:: ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని శక్తి మైత్రి మహిళా సంఘం స్వచ్ఛంద సంస్థ, డైరెక్టర్ నారాయణమ్మ, డిప్యూటీ డిఎంహెచ్వో సెల్వియా సల్మాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ డే సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, ఐసిటిసి, ధర్మవరం శక్తి మైత్రి మహిళా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేసి ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపట్ల చులకన ఉండరాదని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధులు తగిన వైద్య చికిత్సలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక మహిళ సెక్షర్ లో చెన్నైలో ఫిబ్రవరి 1986లో కనుకోవడం జరిగిందన్నారు. ఇండియాలో సుమారు 2.54 మిలియన్ ప్రజలు హెచ్ఐవి తో జీవిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 3.2 లక్షల మంది హెచ్ఐవి తో జీవిస్తున్నారని అంచనాగా తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2018-19 లో 0.14 శాతంగా ఉన్న హెచ్ఐవి వ్యాప్తి 2020-21 లో 0.31 శాతంగా మారిందన్నారు. హెచ్ఐవి ని ముందుగా గుర్తించాలని, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రులలో హెచ్ఐవి కి తగిన వైద్య చికిత్సలు, ఆరోగ్య సూత్రాలు కూడా తెలుపబడునని తెలిపారు. శ్రీ సత్య సాయి జిల్లాలో హెచ్ఐవి తోపాటు ఎయిడ్స్ కొరకు అందుబాటులో పలు సేవలను కూడా నిర్వర్తిస్తున్నట్లు వారు తెలిపారు. హెచ్ఐవి ఏ విధంగా వస్తుంది? పరీక్షలు ఎక్కడ నిర్వహిస్తారు? హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు ఏఆర్టి మందులు ఎక్కడ దొరుకుతాయి? అన్న విషయాలను వివరించడం జరిగిందని తెలిపారు. ఈ అవగాహన ర్యాలీలోనే మానవహారంతో పాటు ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ సునీల్ కుమార్ రాయల్, డాక్టర్ పుష్పలత, డాక్టర్ సురేష్ నాయక్, డాక్టర్ కిరణ్ కుమార్, టిబి సూపర్వైజర్ భాష, ఆశా వర్కర్లు, ఐసిటిసి కౌన్సిలర్ వనమాల, ల్యాబ్ టెక్నీషియన్ భార్గవి, ఓ ఆర్ డబ్ల్యు ఎస్ సిబ్బంది కవిత, లక్ష్మి, సరస్వతి, శర్మ ,త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు