Monday, July 21, 2025
Homeజిల్లాలుప్రకాశంవైద్య శిబిరానికి విశేష స్పందన

వైద్య శిబిరానికి విశేష స్పందన

విశాలాంధ్ర నాగులుప్పలపాడు/ ప్రకాశం జిల్లా : మండలంలోని నిడమానూరు కూనం రామిరెడ్డి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏమ్స్ హాస్పిటల్‌ ఒంగోలు వారి ఆద్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈసందర్బంగా 200 మందికి వైద్యులు బి.వి‌ .రమణారెడ్డి , బి.రామలింగేశ్వర రావు , వి.నీరజా,కార్తీక్, శ్రీహర్ష వైద్య పరీక్షలు న్యూరో, గుండె, బీపీ,షుగర్ తదితర వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మెరుగైన ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.ఏమ్స్ హాస్పిటల్, ఒంగోలు శాఖ సి.ఇ.ఒ డాక్టరు బి.రామలింగేశ్వర రావు మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలుకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు .ఈ శిబిరంలో హాస్పిటల్ మేనేజర్ సువర్ణ రాజు, గ్రామ పెద్దలు డాకా శ్రీనివాసరెడ్డి, మారెడ్డి వీరారెడ్డి, దేవరపల్లి అంజిరెడ్డి, మారెడ్డి రమణారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు