Saturday, December 6, 2025
Homeజిల్లాలుప్రకాశంప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి

ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి

- Advertisement -

వెలిగండ్ల: ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలంలో వైయస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఉపాధ్యక్షులు, జిల్లా జడ్పిటిసి సంఘం అధ్యక్షులు వెలిగండ్ల జడ్పిటిసి గుంటక తిరుపతిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు కావలసిన పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డిని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రబోయిన నాగూర్ యాదవ్, కన్వీనర్ గజ్జల వెంకటరెడ్డి, వైసీపీ తాతపూడి మేరీ పుష్ప, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు పోల్లా సుబ్రమణ్యం, కాకర్ల వెంకటేశ్వర్లు, సర్పంచ్ తాతపూడి సురేష్ బాబు, శ్యామల కృష్ణారెడ్డి, దాదా సోమయ్య, ఏ టి ఆర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గోన జేమ్స్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు