విశాలాంద్ర వలేటివారిపాలెం.(ప్రకాశం జిల్లా )వలేటివారిపాలెం మండల పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్ ఐ గా బి. ప్రేమ్ కుమార్ సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్బంగా ఎస్. ఐ. ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జూదం అక్రమ మద్యం గంజాయి తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సాధిస్తారని అన్నారు.అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. మండలంలో ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అయిన కోడి పందాలు పేకాట మట్కా జూదం ఆడినా, ఆడించిన వారిమీద తీవ్ర చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించనని అన్నారు. మండలంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే వలేటివారిపాలెం పోలీసులకు సమాచారం అందజేయాలని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.పోలీస్ సిబ్బంది నూతన ఎస్ ఐ ను మర్యాద పూర్వకంగా కలుసుకొని పరిచయం చేసుకున్నారు.
వలేటివారిపాలెం ఎస్ ఐ.గా ప్రేమ్ కుమార్
- Advertisement -
RELATED ARTICLES


