జిల్లా కలెక్టర్ శివ నారాయణ శర్మ ఎఫ్ ఏ సి కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ వినతు లు
విశాలాంధ్ర -అనంతపురం : హంద్రీ-నీవా రెండవ దశ కాలువకు కాంక్రీటు వేసే పనుల పై రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శివ నారాయణ శర్మ ఎఫ్ ఏ సి కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హంద్రీ-నీవా కాలువ కర్నూలు, ఉమ్మడి అనంతపురము జిల్లాలో కృష్ణాజలాలు ప్రవహిస్తున్నందువల్ల లక్షలాది ఎకరాలకు నీరు అందుతుందన్నారు . ఈ జిల్లాల్లో హంద్రీ-నీవ కాలువ నీటి ద్వారా భూగర్భజలాలు పెరిగి, బోర్లు రీఛార్జ్ అవుతున్నాయి అన్నారు. రైతులు లక్షలాది ఎకరాల్లో పంటలు సాగుచేసుకొని వారి జీవనాన్ని మెరుగుపరచుకొంటున్నారు అని పేర్కొన్నారు. హంద్రీ-నీవా రెండవ దశ (సెకండ్ ఫేజ్) లో కాంక్రీటు కాలువ ఇరువైపులా అడుగు భాగాన కూడా వేయాలని ప్రభుత్వం నిర్ణయించి నిధులు కూడా మంజూరు చేసిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు, రైతుసంఘాల నాయకులు తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నారన్నారు. భవిష్యత్తులో కాలువకు కాంక్రీటు వేస్తే భూగర్భజలాలు పెరగవని తద్వారా బోర్లన్నీ ఎండిపోతాయని పంటలు పండించేందుకు అవకాశం లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు అని పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురము జిల్లాలో 3 లక్షల50 వేలు ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీల ద్వారా సాగునీరు అందించాల్సి ఉందన్నారు. కానీ ప్రభుత్వం పిల్లకాలువల నిర్మాణం చేపట్ట లేదని కనీసం ఇప్పుడు కాలువలో ప్రవహించే నీటి ద్వారానైనా భూగర్జజలాలు పెరిగి బోర్లు రీఛార్జ్ అవుతాయన్నారు. రైతుల భవిష్యత్తు అంధకారమౌతుంది అని పేర్కొన్నారు. కాంక్రీట్ పనులు జరిగేటప్పుడు రాజకీయ పక్షాలు, రైతుసంఘాలు, మేము అందరము ఏకమై అడ్డుకోవాల్సి వస్తుందన్నారు. రైతుల్లో నెలకొన్నటువంటి భయాందోళనలు తొలగించుటకు రైతుసంఘాల సలహాలు తీసుకొనుటకు ఒక అఖిలపక్ష సమావేశాన్ని మీ ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సి. మల్లికార్జున, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామకృష్ణ, ఏఐటియుసి నాయకులు వికే కృష్ణుడు, జి. చిరంజీవి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.