Homeఆంధ్రప్రదేశ్కూలి పడింది

కూలి పడింది

- Advertisement -

*వంద సంవత్సరాల నాటి వంతెన పిల్లర్ కూలి పడింది* 

విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడి మండలం అన్నదేవరపేట లో కొవ్వాడ కాల్వ పై గల వంద సంవత్సరాల నాటి వంతెన పిల్లర్ తుఫాన్ నేపధ్యం లో పడిపోయింది. అన్నదేవరపేట నుండి టి.మెట్ట, వెంకటాయపాలెం, చెరుకుమిల్లి తదితర గ్రామాల పంట పొలాలకు వెళ్లేందుకు ఈ వంతెన ఉపయోగ పడుతుంది. వర్షం కానీ కొవ్వాడ లో నీటి ప్రవాహం తక్కువగా ఉన్న సమయం లో కొవ్వాడ పై ఉన్న కాజ్ వే ను రహదరిగా వాడతారు. వరదలు వర్షాలు సమయం లో రైతులు పొలాలకు వెళ్లి వచ్చేందుకు పురాతన కాలం నాటి ఈ వంతెన ప్రధాన దారిగాను, ప్రత్యామ్నాయం గాను వినియోగపడుతుంది. ఒక పిల్లర్ పడిపోవడం తో రైతులు పొలాలకు రాకపోకలు కి ఇబ్బంది ఏర్పడింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు