Homeఆంధ్రప్రదేశ్రైతులను నిలువునా ముంచిన 'మొంథా' 

రైతులను నిలువునా ముంచిన ‘మొంథా’ 

- Advertisement -

– చేతికి వచ్చిన పంట నీటిపాలు 

విశాలాంధ్ర – సీతానగరం: మొంథా తుఫాను బీభత్సం రైతులను నిలువునా ముంచింది అనడంలో సందేహం లేదు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సుమారు 14300 ఎకరాల్లో ఖరీఫ్ సాగుగా వరి పంట సాగు చేస్తున్న రైతులు. అయితే దీనిలో సన్న రకాలు అయినా సాంబ, మురళ సాంబ మొదలగు వంటివి అక్టోబర్ 15వ తేదీ నుంచి చేతికి రావడంతో కోతలు ప్రారంభం అయ్యాయి. ఇంతలో ఈ మొంథా తుపాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా వర్షం పడుతుంది. దీనితో చేతికొచ్చిన పంట నెలకొరిగి అక్కడ అక్కడ నేలకొరిగిన వరి కంకులు మొలకలు రావడం జరుగుతుంది. దీనితో రైతులు ఇప్పటివరకూ ఎకరాలు 30 నుండి 40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది అని అవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. దీనిపై మండల వ్యవసాయ అధికారిని గౌరీ దేవిని వివరణ కోరగా మండల వ్యాప్తంగా ప్రాథమిక అంచనా ప్రకారం 1300 ఎకరాలు వరి, 58 ఎకరాలు మినప పంట నష్టం పోవడం జరిగింది అని అన్నారు. తుపాన్ ప్రభావం తగ్గిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుంది అని అన్నారు. అలగే ఈ క్రాప్ చేయించుకొని రైతులు అక్టోబర్ 31వ తేదీ లోపల తప్పనిసరిగా చేయించుకోవాలని కోరారు. ఈ క్రాప్ చేయించుకొన్న రైతులకే ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు వర్తిస్తాయి అని స్పష్టం చేశారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు