విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చేనేత హస్తకళల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌కు బాధ్యతలు అప్పగించింది. అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ను నియమించింది. దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ఆమెకు అదనపు బాధ్యతలు ఇచ్చింది. జీఏడీ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్‌ను నియమించింది. మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్ నియమితులయ్యారు. రాష్ట్ర అటవీ ప్రధాన సంరక్షణ అధికారిగా వినయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చింది. మరోవైపు సీఎంవోలోనూ కీలక మార్పులు జరిగాయి. సీఎంవో ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డిని ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవోగా బదిలీ చేసింది. సీఎంవో ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్‌ను నియమించింది.


