విశాలాంధ్ర– తాడేపల్లిగూడెం : మున్సిపల్ ఉద్యోగిగా రవికుమార్ అందించిన సేవలను తోటి ఉద్యోగులు ఆదర్శంగా తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసు బాబు అన్నారు స్థానిక మున్సిపల్ కౌన్సిల్ కార్యాలంలో ఉద్యోగ విరమణ సన్మాన సత్కార అభినందన సభ జరిగింది ఉద్యోగ విరమణ చేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ దేట రవికుమార్, ఆఫీస్ సబార్డినేట్ పాతపాటి ఆంజనేయరాజు లకు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో తోటి ఉద్యోగులు మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు కూటమి నాయకులు వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ వలవల బాబ్జి మాట్లాడుతూ రవికుమార్ ఆంజనేయరాజులుపార్టీలకతీతంగా సేవలు అందించారన్నారు వారి సేవలు మరువలేనివి, ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందిస్తూ, అందరి మన్నలు పొందిన ఉద్యోగులుగా గుర్తింపు పొందడం అభినందనీయం అన్నారు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించే ఉద్యోగులు ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతారన్నారు సన్మాన గ్రహీత అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్ మాట్లాడుతూ ఇదే మున్సిపాలిటీలో అకౌంటెంట్, రెవెన్యూ ఆఫీసర్ గా అసిస్టెంట్ కమిషనర్ గా సేవలు అందించడం నా అదృష్టం , ఉద్యోగ రీత్యా ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించాలని కోరారు, ఉద్యోగ బాధ్యతల్లో నాకు తోటి ఉద్యోగులు అందించిన సహకారం మరువలేనిది అన్నారు మరో సన్మాన గ్రహిత ఆంజనేయరాజు మాట్లాడుతూ సుమారు 44 సంవత్సరాల పాటు ఆఫీస్ సబర్డినేట్ గా సేవలు అందించడం నా అదృష్టం, నా ఉద్యోగ సేవలో అధికారుల నుంచి ప్రజా ప్రతినిధుల నుంచి మంచిగా అభినందించబడటం నా జీవితంలో ఏప్పుడు మర్చిపోలేను అన్నారు నాకు ఉద్యోగ అవకాశం కల్పించిన ఈలి ఆంజనేయులు కు ఋణపడి ఉంటాను అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు ఈతకోట తాతాజీ, దేవతి పద్మావతి, మున్సిపల్ ఉద్యోగులు కూటమి నాయకులు , మాజీ కౌన్సిలర్లు, వార్డు సచివాలయ ఉద్యోగులు, సన్మాన గ్రహీతల కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు


